English   

మాటీవీని వెనక్కి నెట్టిన జీటీవి..అసలైన పోటీ ఇప్పుడే మొదలైంది

 Zee overtakes Star Maa
2021-01-08 10:34:08

తెలుగు ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానళ్లలో మాటీవీ, ఈటీవీ, జితెలుగు లు పోటీ పడుతుంటాయి. వీటిలో మాటీవీనే గత కొంతకాలంగా రేటింగ్ లో దూసుకుపోతూ నంబర్ 1 స్థానంలో నిలుస్తోంది. అయితే ఇప్పుడు నంబర్ 1 స్థానానికి తాము వచ్చామని జితెలుగు తెగ ప్రచారం చేసుకుంటుంది. అంతే కాకుండా స్పెషల్ ఈవెంట్లలో డప్పు కొడుతోంది. జితెలుగు రేటింగ్స్ లో మాటివిని దాటేసిన మాట వాస్తవమే..కానీ అది కేవలం హైదరాబాద్ నగరంలోనే దాటేసింది. మిగతా ప్రాంతాల్లో మొత్తం మాటీవీ హవానే కొనసాగుతుంది. దాంతో మాటీవీ కూడా మేమే నంబర్ 1 అని ప్రచారం చేసుకుంటుంది. 

మాటీవీ రేటింగ్ లకు ముఖ్య కారణం ఛానల్ లో వచ్చే కార్తీకదీపం, దేవత, గృహాలక్ష్మి లాంటి సీరియల్స్ వల్లే అని చెప్పవచ్చు. ఈ సీరియల్స్ కు తెగ అభిమానులు ఉండటంతోనే మాటీవీ ఇంకా రేటింగ్ లో ముందంజలో ఉందట. జితెలుగు లోనూ ఇలాంటి సీరియల్స్ ఉన్నా ప్రేక్షకాదరణ మాత్రం పెరగలేదు. ఇక ఇప్పుడు నగరంలో ప్రేక్షకులు మాత్రం జీటీవి చూడటంతో జీటీవి ఆనందానికి అవదుల్లేవు. అందువల్లే ఇంకా మొదటి స్థానాననికి చేరుకోకపోయినా యాడ్ ఏజన్సీలను, ప్రేక్షకులను ఆకర్షించడానికి తామే నంబర్ 1 అంటూ ఫేక్ ప్రచారం మొదలు పెట్టింది. కానీ జితెలుగు ఇలాగే ముందుకు దూసుకువస్తే ఆ ఫేక్ ప్రచారం కాస్తా నిజమై తీరుతుంది.

More Related Stories