తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు

తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు త్వరలో భాద్యతలు స్వీకరించబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు రాజకీయాలను భాగా దగ్గర నుండి చూసిన వ్యక్తి అయితేనే బెటర్ అని కేంద్రం కృష్ణంరాజు ను నియమించాలని అనుకుంటుందట. కృష్ణంరాజు కి తమిళనాడుతో పాతికేళ్ల అనుబంధం ఉంది. అక్కడి పరిస్థితులు ఆయనకు బాగా తెలుసు. వాజ్ పాయ్ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు. దాంతో గవర్నర్ గా కృష్ణంరాజు పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా విద్యాసాగర్ రావు ఉన్నారు. గతేడాదితో రోశయ్య పదవీకాలం ముగియడంతో ఇంచార్జ్ గవర్నర్ గా విద్యాసాగర్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇప్పుడు కేంద్రం కృష్ణం రాజును గవర్నర్ గా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కృష్ణంరాజు కాకినాడ నుండి 1998 లో ఎంపీగా పోటీచేసి గెలిచారు. అత్యధిక మెజారిటీతో గెలిచిన ఆయనకు కేంద్రమంత్రి పదవి అప్పగించారు. తరవాత నరసాపురం నుండి ఎంపీగా గెలిచారు. ఇక మెగాస్టార్ స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి ఆయన ఓటమిపాలయ్యారు. చివరికి మళ్ళీ బీజేపీ గూటికి చేరిపోయారు.