English   

బాలీవుడ్ కు బిగ్ బాస్ సోహెల్

 Bigg Boss Sohel
2021-01-08 13:01:56

తెలుగు బిగ్ బాస్ సీజన్-4 లో విన్నర్ అభిజిత్ అయినప్పటికీ లక్కీ కంటెస్టెంట్ మాత్రం సోహెల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. విన్నర్ గా నిలిచిన అభిజిత్ కు బిగ్ బాస్ నుండి 25 లక్షల ప్రైజ్ మనీ రాగా.. థర్డ్ ప్లేస్ లో ఉన్న సోహెల్ కూడా పోటీ నుండి తప్పుకుని రూ. 25 లక్షలు గెలుచుకున్నాడు. అంతే కాకుండా సోహెల్ కు ఇతర బెనిఫిట్స్ కూడా లభించాయి. సోహెల్ అనాధాశ్రమానికి ఐదు లక్షలు ఇస్తానని చెప్పడంతో..ఆ డబ్బు నేను ఇస్తానని నాగార్జున హామీ ఇచ్చారు. అంతే కాకుండా మెహబూబ్ ఇంటి కోసం 5 లక్షలు సాయం చేస్తానని చెప్పడంతో మెగాస్టార్ స్టేజ్ పైనే రూ.10 లక్షల చెక్ రాసి అందించారు. దాంతో సోహెల్ కు మొత్తం 45 లక్షలు ముట్టాయి. అంటే విన్నర్ కంటే సోహెల్ 20 లక్షలు ఎక్కువే తీసుకున్నాడు. మరోవైపు మెగాస్టార్...  సోహెల్ సినిమాకు ప్రమోషన్ చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ నుండి భయటకు వచ్చాక కూడా సోహెల్ కు సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే "జార్జ్ రెడ్డి" సినిమా ప్రొడ్యూసర్ సోహెల్ తో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. కాగా తాజాగా ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో తనకు బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందని సోహెల్ చెప్పాడు.  

More Related Stories