English   

క్రాక్ సినిమా విడుదలకు బ్రేక్

 Krack release
2021-01-09 11:01:37

మాస్ మహరాజ్ రవితేజ అభిమానులకు చేదు వార్త. ఈరోజు విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్న క్రాక్ సినిమా మార్నింగ్ షోలు రద్దయ్యాయి. ఈ సినిమా నిర్మాత ఠాగూర్ మధు బకాయిలను క్లియర్ చేయకపోవడంతో స్క్రీన్ సీన్ మీడియా కోర్టును ఆశ్రయించింది. దాంతో షోలు నిలిపివేయాలని అదేశించింది. మరోవైపు మధ్యాహ్నం కూడా షోలు నిలిచిపోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే మార్నింగ్ షో టికెట్లు బుక్ చేసుకున్నవారికి "క్రాక్" ప్రదర్శన లేదని మెసేజ్ లు వస్తున్నాయి. కొత్తగా బుక్ చేసుకోవాలని ప్రయత్నిస్తే టికెట్లు బుక్ అవ్వడం లేదు. సినిమా విడుదల కు బ్రేక్ పడటంతో రవితేజ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. చాలా కాలం తరువాత తమ అభిమాన సినిమా హీరో సినిమా కోసం సిద్ధం అయిన క్షణం లో ఇలా జరగడంతో ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.

More Related Stories