English   

చావు కబురు చల్లగా టీజర్ అప్డేట్

Chaavu Kaburu Challaga Movie Teaser
2021-01-09 15:34:24

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ గా అలరిస్తున్నాడు. ఇక ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న చిత్రం "చావు కబురు చల్లగా" . ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇప్పటికే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో కార్తికేయ ఇంట్రెస్టింగ్ రోల్ లో శవాల స్పెషలిస్ట్ బస్తి బాల రాజుగా కనిపించనున్నాడు. ఈ సినిమాకు కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు సినిమాను నిర్మిస్తున్నారు.

సినిమాలో లావణ్య త్రిపాఠి..కార్తికేయతో రొమాన్స్ చేయనుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా పై చిత్ర యూనిట్ కీలక అప్డేట్ ఇచ్చింది. సమ్మర్ లో "చావు కబురు చల్లగా" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తామని పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేసింది. అంతే కాకుండా ఈనెల 11న 10:56 నిమిషాలకు సినిమా టీజర్ ను విడుదల చేస్తామని పేర్కొంది. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో టీజర్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

More Related Stories