English   

తొంగి తొంగి నడుము చూడ్డానికే చీర కట్టుకోమంటారు..మాధవీ లత

Madhavi Latha
2021-01-09 16:39:54

"నచ్చావులే" సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన భామ మాధవీ లత. ఈ బ్యూటీ ఒకటో రెండో సినిమాలు చేసి ఆ తరవాత పెద్దగా కనిపించలేదు.  సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మాధవీ లత ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ కొంత క్రేజ్ కూడా సంపాదించింది. ఇక ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్న మాధవీ లత ఏపీ రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటూ అధికార పార్టీపై విమర్శలు చేస్తుంది. తాజాగా సోషల్ మీడియా లో లైవ్ లోకి వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీలో ఉన్న మాధవీ లతను నెటిజన్లు చీర కట్టుకోవాలని అదే మన సాంప్రదాయం అని ఎద్దేవా చేశారు. 

దాంతో మాధవీ మాట్లాడుతూ.."చీర కట్టుకుంటే నడుమును తొంగి తొంగి చూసే రకాలు మీరు.. చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. అదే టీషర్ట్ అయితే వేసుకుంటే సరిపోతుంది." అంటూ వ్యాఖ్యానించింది. అంతే కాకుండా రాష్ట్రంలో గుడులు పడగొడుతున్న వారికే సపోర్ట్ చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని..అలా మాట్లాడేవాళ్లకు అదే రీతిలో సమాధానం ఇస్తానని చెప్పింది. అంతే కాకుండా బీజేపీలో కొందరు నేతలపై ఆరోపణలు చేస్తున్నారని..తప్పు చేసేవాళ్ళు బీజేపీ లో ఉన్నా తాను వారిని తిడతానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More Related Stories