English   

అంగరంగ వైభవంగా సునిత రామ్ ల వివాహం..!

singer sunitha gets married
2021-01-10 20:03:27

ప్రముఖ నేపథ్య గాయని సునిత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత మాంగో రామ్ సునిత మెడలో మూడు ముళ్ళు వేశారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ లోని అమ్మపల్లి దేవాలయంలో వీరి వివాహం జరిగింది. ఆలయ ప్రాంగణంలో  అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అంగరంగవైభవంగా ముస్తాబు చేసారు. సునిత రామ్ ల వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు సతీ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతే కాకుండా ఇటీవలే వివాహం చేసుకున్న యంగ్ హీరో నితిన్ సైతం సతీసమేతంగా విచ్చేసి పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం సునిత వివాహ వేడుకకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సునిత రామ్ లకు ఆమె అభిమానులు విషెస్ చెబుతున్నారు. 

 

More Related Stories