English   

"లవ్ స్టొరీ" టీజర్ విడుదల.!

love story teaser released
2021-01-10 13:33:11

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లు గా నటిస్తున్న సినిమా "లవ్ స్టొరీ". ఈ సినిమా ను అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. కాగా ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా చిత్ర యూనిట్ "లవ్ స్టొరీ" టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో శేఖర్ కమ్ముల మ్యాజిక్ కనిపిస్తోంది. నాగ చైతన్య తెలంగాణ స్లాంగ్ లో అదరగొడుతున్నాడు. ఇక సాయి పల్లవి సైతం నిజామాబాద్ అమ్మాయిలా మాట్లాడుతూ కనిపించింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ సినిమా లో ఎక్కువ శాతం షూట్ ను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో చిత్రించారు. టీజర్ లో సాయి పల్లవి, నాగ చైతన్య లు కెరీర్ లో సెటిల్ అవ్వడానికి తపిస్తున్నట్టు అర్థం అవుతుంది. అంతే కాకుండా డైలాగ్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. సినిమా టీజర్ కు విడుదల చేసిన తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

More Related Stories