English   

చావు కబురు చల్లగా టీజర్ విడుదల

Chaavu Kaburu Challaga
2021-01-11 15:42:17

ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరో కార్తికేయ టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. మొదటి సినిమానే హిట్ అవ్వడంతో కార్తికేయ తెగ పాపులర్ అయ్యాడు. ఆ ఆతరవత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్నాడు. తాజాగా కార్తికేయ నటిస్తున్న సినిమా "చావు కబురు చల్లగా". ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సినిమాలో కార్తికేయ సరసన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠీ నటిస్తోంది. కౌశిక్ పెగర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సినిమాలో కార్తికేయ బస్తీ బలరాజుగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా చిత్ర యూనిట్ సినిమా టీజర్ ను విడుదల చేసింది. టీజర్ లావణ్య త్రిపాఠీ, కార్తీకేయ మధ్య జరిగిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

More Related Stories