English   

తండ్రైన విరాట్‌ కోహ్లీ..కొత్త అధ్యయనం ప్రారంభమైందంటూ ట్వీట్

Virat Kohli
2021-01-11 18:20:43

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రయ్యారు. ఆయన భార్యామణి బాలీవుడ్ నటి అనుష్క శర్మ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా 2021 జనవరిలో మేమిద్దరం ముగ్గురం కాబోతున్నామంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేసి అనుష్క ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించాడు. ఇక తాజాగా తన భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చిందని జీవితంలో కొత్త అధ్యయనం మొదలైందని ట్వీట్ చేసాడు. ట్వీట్ లో విరాట్ "‘ఈ విషయాన్ని మీతో పంచుకోడం చాలా థ్రిల్లింగా ఉంది. ఈ సాయంత్రం మాకు పాప పుట్టింది. అనుష్క, పాప ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. నేటి నుంచి మా జీవితాల్లో మరో కొత్త చాప్టర్ ప్రారంభం కానుంది " అంటూ పేర్కొన్నాడు. అనుష్క విరాట్ జంట బిడ్డకు జన్మనివ్వడంతో వారి అభిమానులు ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అనుష్క విరాట్ లు 2017 లో  ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబై, ఢిల్లీలో వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. అనుష్క విరాట్ ల కెరీర్ విషయానికొస్తే ఇద్దరూ భాగా రాణిస్తున్నారు. భారత క్రికెట్ లో విరాట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనుష్కశర్మ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

More Related Stories