English   

అల వైకుంఠ పురంలో సినిమాకు ఏడాది..సంవత్సరంలో రికార్డుల మోత

 Ala Vaikunthapurramuloo
2021-01-12 13:14:38

అల్లు అర్జున్ హీరోగా 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమా "అల వైకుంఠపురంలో". ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సినిమాను అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మించారు. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటించింది. ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ సినిమా పాటలు మొగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా నేటితో ఈ సినిమాకు ఏడాది పూర్తయ్యింది. ఈ సినిమా సక్సెస్ ను గుర్తుచేసుకుంటూ నిన్న చిత్ర యూనిట్ రియూనియన్ పార్టీని కూడా సెలబ్రేట్ చేసుకుంది. 

ఇక ఈ సినిమా విడుదలైన నాటి నుండి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. 2020 లో విడుదలైన సినిమాల్లో డిజిటల్ మాధ్యమాల్లో ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలిచింది. యూట్యూబ్ లో సినిమాకు 1.6 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. సినిమా పాటలకు మ్యూజిక్ యాప్స్ లో 800 మిలియన్ మంది స్ట్రీమింగ్ చేశారు. సినిమాలోని రాములో రాములా పాట తెలుగులో వేగంగా 100 మిలియన్ వ్యూవ్స్ వచ్చిన పాటగా నిలిచింది. తెలుగు సినిమాల్లో అత్యధిక టిఆర్పి 29.4 వచ్చిన సినిమాగా నిలిచింది. బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ ఆప్ ద డికేడ్  గా నిలిచింది.

More Related Stories