కరోనాను జయించిన రామరాజు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కరోనా ను జయించారు. ఈ విషయాన్ని ఆయనే తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చిందని చరణ్ పేర్కొన్నారు. త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటానని అన్నారు. అంతే కాకుండా తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు. మెగా ఫ్యామిలి లో ఒకేసారి ఇద్దరు హీరోలు కరోనా భారిన పడటం ఫ్యాన్స్ ను ఆందోళన కలిగించింది. మొదట చరణ్ తనకు కరోనా వచ్చిందని చెప్పగా..ఆ వెంటనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. వరుణ్ ఇప్పటికే కరోనా నుండి కోలుకుని ఎఫ్-3 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక కరోనా నుండి కోలుకున్న చరణ్ కూడా వీలైనంత త్వరగా "ఆర్ఆర్ఆర్" షూటింగ్ లో పాల్గొంటారు. ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు చిరంజీవి నటిస్తున్న "ఆచార్య" సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు.