సునీల్ తో రొమాన్స్ కు ఓకే చెప్పిన జబర్దస్త్ బ్యూటీ

ప్రముఖ యాంకర్ అనసూయ ఇటు టీవీ షోలతో అటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా నటించిన అనసూయ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా వుంది. ప్రస్తుతం అనసూయ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న "రంగ మార్తాండ" సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా అనసూయ సునీల్ సినిమాలో ఆఫర్ దక్కించుకుందని టాక్ నడుస్తోంది. సునీల్ ఓ వైపు సోలో గా సినిమాలు చేస్తూ మరోవైపు కమిడియన్ గాను నటిస్తూ మెప్పిస్తున్నాడు.
అంతేకాకుండా ఇటీవల వచ్చిన "కలర్ ఫోటో" సినిమాలో విలన్ గా నడిచి ఆ పాత్రకు న్యాయం చేశాడు. ఇక ప్రస్తుతం సునీల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా "వేదాంతం రాఘవయ్య". ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాద్ లో నిర్వహించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కీలకంగా ఉంటుందట. ఈ నేపథ్యంలో జబర్దస్త్ బ్యూటీ అనసూయకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆఫర్ నచ్చడం..సినిమాలో తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండటంతో అనసూయ కూడా ఆఫర్ కు ఒకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది. ఇక సునీల్, అనసూయ జంట స్క్రీన్ పై ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.