English   

సోనూసూద్ నేరాలకు అలవాటుపడ్డ వ్యక్తి...నగరపాలక సంస్థ షాకింగ్ కామెంట్స్

Sonu Sood
2021-01-13 11:36:53

లాక్ డౌన్ వేళ నటుడు సోనూసూద్ కష్టాల్లో ఉన్నవారికి ఎన్నో సేవాకార్యక్రమాలు రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. లాక్ డౌన్ తరవాత సైతం ఆయన తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన చేస్తున్న సేవలకు గానూ సాధారణ ప్రజలే కాకుండా ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. దాంతో ఆయన మంచి తనాన్ని కొనియాడారు. ఇదిలా ఉండగా సోనూసూద్ ముంబై లో అక్రమ నిర్మాణాలు చేపట్టడని ఆరోపిస్తూ ముంబై నగరపాలక సంస్థ కోర్టును ఆశ్రయించడం అందరినీ షాక్ కు గురిచేసింది. 

అంతే కాకుండా కోర్టులో ముంబై నగరపాలక సంస్థ సోనూసూద్ పై సంచలన ఆరోపణలు చేసింది. సోనూసూద్ నేరాలకు అలవాటు పడ్డ వ్యక్తని తెలిపింది. ముంబై లోని జుహూ నివాసిత ప్రాంతంలో అతడు అక్రమాలకు పాల్పడ్డాడని ఆ కట్టడాలను కూల్చివేసినా తీరు మార్చుకోలేదని పేర్కొంది. సోనూ ఇటీవల హైకోర్ట్ లో వేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని సమాధానంగా నగరపాలక సంస్థ అఫిడవిట్ ను దాఖలు చేసింది. సోనూసూద్ తమ నివాసంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపిస్తూ నగరపాలక సంస్థ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. సివిల్ కోర్టు తిరస్కరించడంతో ఆయన హైకోర్ట్ ను ఆశ్రయించారు.

More Related Stories