English   

విరాటపర్వం మరో పోస్టర్ విడుదల..సినిమా ఎప్పుడంటే

Virata Parvam
2021-01-13 14:32:40

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం నటిస్తున్న సినిమా "విరాట పర్వం". ఈ సినిమాకు వేణు ఉడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రానా మాజీ డా.రవిశంకర్ అలియాస్ రవన్న పాత్రలో నటిస్తున్నారు. 1990 కాలం నాటి నిజ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై రానా అభిమానులతో పాటు మూవీ లవర్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో రానా సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది. 

అంతే కాకుండా సినిమాలో ప్రియమణి, నివేతా పేతురాజ్, నందిత దాస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా చిత్ర యూనిట్ మరో పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో రానా సాయి పల్లవి జంట ప్రేమ పక్షుల్లా కనిపిస్తున్నారు. సాయి పల్లవి రానా చెయ్యి పట్టుకుని అతడి మాయలో పడినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా సినిమా విడుదల పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. సినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు స్పష్టం చేసింది. ఎన్నో అంచనాలతో వస్తున్న విరట పర్వం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

More Related Stories