English   

రామ్ "రెడ్" సినిమా రివ్యూ..!

red movie review
2021-01-14 15:22:39

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ లో రెండు షేడ్స్ ఉంటాయి. ఒకవైపు లవర్ బాయ్ గా కనిపించే రామ్..మరోవైపు మాస్ హీరోలా ఫైట్లు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తాడు. సినిమాల్లో ఎనర్జిటిక్ గా డైలాగులు కొడుతూ విలన్లకు చెమటలు పట్టించడంలోనూ..స్టైల్ గా స్టెప్పులు వేయడంలోనూ రామ్  స్టైలే వేరు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ తెలంగాణ యాసలో అదరగొట్టి ఫ్యాన్స్ లు  అలరించాడు. దాంతో రామ్ తరవాత సినిమా "రెడ్" పై భారీ అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ నటించిన "రెడ్ " సినిమా ఎలా ఉందో ఇప్పడు చూద్దాం.

 

కథ-కథాంశం : సినిమాలో రామ్ (సిద్ధార్థ్, ఆదిత్య )అనే రెండు పాత్రల్లో నటించాడు. సాధారణంగా డబుల్ యాక్షన్ అంటే ఒకరు రిచ్ ,ఒకరు పూర్ లేదంటే ఒకరు మాస్ అయితే మరొకరు క్లాస్. రెడ్ లోనూ రామ్ పాత్రలు అలానే ఉన్నాయి. సిద్ధార్థ్ సివిల్ ఇంజనీర్ గా ఆదిత్య ఆవారా గా తిరిగే పాత్రలో కనిపించాడు. సిద్ధార్థ్ సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆఫీస్ లోనే మహిమ (మాళవిక)తో ప్రేమలో పడతాడు. ఆదిత్య తన ఫ్రెండ్ సత్య తో ఆవారాగా తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆదిత్య అప్పు చేసి పేకాట ఆడి రూ.8లక్షలు పోగొట్టుకుంటాడు. వెంటనే ఆ డబ్బు కటగలంటూ రౌడీలు వార్నింగ్ ఇస్తారు. కట్ చేస్తే సిద్ధార్త్ తన లవర్ కు ప్రపోస్ చేసాడని ఒకడిని చంపేస్తాడు. దాంతో ఓ సెల్ఫీ ఆధారంగా సిద్ధార్థ్ ను అరెస్ట్ చేసి యామిని (నివేత పేతురాజ్) ఎంట్రీ ఇస్తుంది. సిద్దార్థ్ ను అరెస్ట్ చేసి వేసిన జైలులోనే డ్రంకన్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన ఆదిత్య కూడా ఉంటాడు. దాంతో వీళ్ళిద్దరిని చూసిన పోలీసులు షాక్ అవుతారు. అసలు వీళ్లిద్దరూ ఎవరు..? ఎందుకు ఒకేలా ఉన్నారు.? సిద్ధార్థ్ ,ఆదిత్య మధ్య గొడవ ఎందుకు జరిగింది.? కేసును ఎలా సాలో చేసారు.?చివరకు సిద్ధార్థ్ ప్రేమను మాళవిక అంగీకరించిందా అన్నదే కథ.

 

విశ్లేషణ : రామ్ పోతినేని నటన..సినిమా కొత్త సబ్జెక్ట్ కావడంతో సినిమా మొదట్లో ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తించింది. టైట్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలో దర్శకుడు అనవసరమైన సీన్లు స్టోరీలోకి ఎంటర్ చేసి సినిమాను దెబ్బ కొట్టాడు. ఇక సినిమా హైప్ లేసేసరికి సెకండ్ హాఫ్ లో వచ్చిన అనవసర కామెడీ, ఫ్లాష్ బ్యాక్ సీన్ల వల్ల థ్రిల్ మిస్ అయ్యిందనిపిస్తుంది. అయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ చివరి అరగంటలో వచ్చే ట్విస్టులతో మళ్ళీ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేశారు. కాగా బలమైన కొత్త కథాంశం క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడిని సీట్లో కూర్చో పెడుతుంది. సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం ప్లస్ గా నిలిచింది. మొత్తానికి ఈ సినిమా ఒక కొత్త ప్రయోగమనే చెప్పాలి. మరికొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఉంటే భారీ హిట్ గా నిలిచేది.

 

More Related Stories