English   

రికార్డు స్థాయిలో "మాస్టర్" ఫస్ట్ డే కలెక్షన్స్

master first day total collections
2021-01-14 15:47:45

సంక్రాంతి కానుకగా తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన "మాస్టర్" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాను నేరుగా తెలుగులో కూడా విడుదల చేసారు. తమిళ స్టార్ హీరో విజయ్ ఈ మధ్య తెలుగులోనూ తన మార్కెట్ ను విస్తరించుకున్న నేపథ్యంలో ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఇక సినిమా ట్రైలర్ విడుదలైన నాటి నుండి సినిమాపై అంచలనాలు పెరిగాయి. దాంతో ఫస్ట్ డే సినిమాను చూడ్డానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపారు. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమా వసూళ్ల  వర్షం కురిపించింది. ఇక ప్రాంతాల వారిగా కలెక్షన్ వివరాలు చూసుకుంటే ఇలా ఉన్నాయి. నిజాం లో 1.49 కోట్లు కలెక్ట్ చేసిన మాస్టర్..సీడెడ్ లో 1.1 కోట్లు, వైజాగ్ 83 లక్షలు, వెస్ట్ గోదావరి 56 లక్షలు, ఈస్ట్ గోదావరి 48 లక్షలు, గుంటూరు 67 లక్షలు ,కృష్ణ 36 లక్షలు, నెల్లూరు 25 లక్షలు కలెక్షన్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు షేర్ 5.76 కలెక్ట్ చేసింది. అంతే కాకుండా మొదటి రోజే ఈ సినిమా 80 శాతం రికవరీని రాబట్టింది.

More Related Stories