English   

మంచు ఫ్యామిలీకి షాక్..మనోజ్ వాట్సాప్ హ్యాక్

Manchu Manoj
2021-01-18 11:02:54

రాక్ స్టార్ మంచు మనోజ్ కు షాక్ తగిలింది. తాజాగా  ఆయన వాట్సాప్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు నా వాట్సప్ హ్యాక్ కు గురయ్యింది. దాని నుండి ఎలాంటి మెసేజ్ లు వచ్చినా దయచేసి స్పందించకండి" అంటూ మనోజ్ ట్వీట్ చేసారు. ఇదిలా ఉండగా జనవరి 14వ తేదీన మనోజ్ సోదరి..మంచు లక్ష్మి వాట్సాప్ కూడా హ్యాక్ కు గురైంది. మంచు లక్ష్మి పండగ పూట తిరుమలలో ఉండగా తన వాట్సాఫ్ హ్యాక్ అవ్వడం చూసి షాక్ అయ్యారు. 

వెంటనే లక్ష్మి సైతం తన వాట్సప్ హాక్ అయ్యిందటూ ట్వీట్ చేసారు. తాను దీనిపై సైబర్ క్రైం కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఇప్పుడు మనోజ్ కూడా వాట్సాప్ హ్యాక్ అయిందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. దాంతో మంచు ఫ్యామిలీ షాక్ అవుతోంది. కావాలనే ఎవరైనా హాక్ చేస్తున్నారా..లేదంటే ఏదైనా సాంకేతిక లోపంతో జరుగుతుందా అని అనుమానం వస్తోంది. మరోవైపు వాట్సప్ తెచ్చిన యూజర్ డేటా పాలసీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రైవేట్ పాలసీ కారణంగా యూజర్ల డేటా కు భద్రత ఉందదని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో ప్రైవసీ పాలసీ కారణంగా ఇప్పటికే చాలా మంది సిగ్నల్, టెలిగ్రామ్ కు షిఫ్ట్ అవుతున్నారు.

More Related Stories