English   

టాలీవుడ్  ప్రముఖ నిర్మాత వి దొరస్వామి రాజు కన్నుమూత

V Doraswamy
2021-01-18 12:08:11

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి రాజు బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో ఈ రోజు(18-01-2021) ఉదయం గుండెపోటుతో మరణించారు. దొరస్వామి రాజు (విడిఆర్). వి.ఎం.సి ఆర్గనైజేషన్స్ (విఎంసి ప్రొడక్షన్స్, విఎంసి పిక్చర్స్, విఎంసి ఫిల్మ్స్, విఎంసి 1 కంపెనీ, విఎంసి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, విఎంసి పిక్చర్ ప్యాలెస్) వ్యవస్థాపకులు.  చిత్ర నిర్మాత గానే కాకుండా దొరస్వామి రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. నగరి ఎమ్మెల్యే గా పనిచేశారు. అలాగే టిటిడి బోర్డు సభ్యులు, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేశారు, పంపిణీదారుల మండలి అధ్యక్షులు, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా పనిచేసారు. ఆయన టాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన తెలుగు చిత్ర నిర్మాత, పంపిణీదారు మరియు ఎగిబిటర్ లలో ఒకరు. 1978 లో VMC ను ప్రారంభించారు.

ఈ బ్యానర్ ను మహానటులు NT రామారావు గారు ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు తో బ్లాక్ బస్టర్స్ సీతారామయ్య గారి మనవరాలూను నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును పొందదమే కాక అనేక జాతీయ అవార్డులను అందుకుంది. ఆయన నిర్మించిన అన్నమయ్య సినిమా ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు . ఈ చిత్రం సంచలన విజయం అందుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. ఆయన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సుమారు 750 చిత్రాలకు పైగా పంపిణీ చేశారు, ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో. ఆయనను రాయలసీమ రారాజు అని పిలిచేవారు.

More Related Stories