English   

బ్రేక్ ఇన్స్పెక్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్

 Pawan Kalyan
2021-01-19 11:53:24

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో చురుకుగా ఉంటూనే మరోవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ ఆ తరవాత క్రిష్ తో ఓ సినిమా చేయనున్నారు. అంతే కాకుండా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా ఇలా చేతినిండా సినిమాలతో ఉన్నారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ బాబాయ్ పవన్ తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చరణ్, పవన్ లు కలిసి మలయాళం సూపర్ హిట్ అయిన "డ్రైవింగ్ లైసెన్స్" అనే సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే రామ్ చరణ్ ఈ సినిమా రైట్స్ ను సైతం సొంతం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా సినిమాలో పవన్ బ్రేక్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించనున్నారంటూ టాక్ నడుస్తోంది. మలయాళ సినిమా "డ్రైవింగ్ లైసెన్స్" లో పృద్విరాజ్, సూరజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సూరజ్ బ్రేక్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించారు. ఇప్పుడు తెలుగులో ఆ పాత్రను పవన్ చేయనున్నారట. చరణ్ పృథ్వీరాజ్ నటించిన క్యారెక్టర్ లో నటించబోతున్నాడట. అంతా అనుకున్నట్టు జరిగితే బాబాయ్ అబ్బాయ్ ని స్క్రీన్ పై కనిపిస్తే మెగా అభిమానులకు పండగే అని చెప్పాలి.  

More Related Stories