English   

సద్దాంను హీరో చేసిన నాగబాబు..దర్శకుడిగా జబర్దస్త్ కమెడియన్

saddam
2021-01-20 16:16:35

ప్రస్తుతం నాగబాబు జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పి జి తెలుగులో అదిరింది షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో కూడా ప్రస్తుతం మంచి రేటింగ్ తో నడుస్తోంది. ముఖ్యంగా అదిరింది లో సద్దాం హుస్సేన్ కామెడీ టైమింగ్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. రాయలసీమ యాసలో సద్దాం వేసే పంచులకు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూవ్స్ వస్తుంటాయి. నాగబాబు కూడా సద్దాం కామెడీని ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇదిలా ఉండగా నాగబాబు ఇప్పుడు తన ఫెవరెట్ కమెడియన్ సద్దాం హుస్సేన్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగబాబు తనకు జబర్దస్త్ లో నచ్చిన కామెడియన్లకు కూడా ఇదివరకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు. 

కానీ ఈసారి ఏకంగా తన సినిమాలో సద్దాం కు హీరో ఛాన్స్ ఇస్తున్నారు. అంతే కాకుండా ఆ సినిమాను స్వయంగా ఆయనే నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దర్శకుడిగా కూడా జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ వ్యవహరిస్తున్నారు. బుల్లెట్ భాస్కర్ వినిపించిన కథ నాగబాబుకు నచ్చడంతో ఆయన సినిమాను నిర్మించేందుకు ఒకే చెప్పారు. ఈ సినిమా పేరు "బస్తీ బాయ్స్ " కాగా ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. జబర్దస్త్ నుండి భయటకు వచ్చిన ఆర్పీ కూడా దర్శకుడిగా మారి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక గల్లీ బాయ్స్ తో అలరించిన సద్దాం "బస్తీ బాయ్స్"గా ఏ మేరకు అలరిస్తాడో చూడాలి. 

More Related Stories