టాలీవుడ్ యంగ్ హీరోపై చీటింగ్ కేసు

2021-01-20 16:25:47
టాలీవుడ్ కు చెందిన యంగ్ హీరో పై చీటింగ్ కేసు నమోదైంది. తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తానంటూ మోసం చేయడంతో పలువురు పోలీసులను ఆశ్రయించారు. ఆ హీరో ఎవరో కాదు కేరింత సినిమా తో ప్రేక్షకుల ముందు వచ్చిన విశ్వంత్. కేరింత సినిమాలో విశ్వంత్ ఓ కీలక పాత్రలో నటించారు. ఆ తరవాత పిట్టకథ, మనమంత, జెర్సీ సినిమాల్లో నటించారు. అయితే తాజాగా విశ్వంత్ తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తామని మోసం చేశాడంటూ పలువురు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వత్ పూర్తిపేరు విశ్వనాథ్ ఈయన కాకినాడ లోని సమర్లకోటలో జన్మించాడు. ఇంటర్ వరకు విశాఖపట్నం లో చదువుకున్నాడు. ఆ తరవాత హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి యాక్టింగ్ పై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.