English   

మహేష్ బాబు జిమ్ వీడియో..సోషల్ మీడియాలో వైరల్

mahesh babu
2021-01-21 14:29:17

సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉండే మహేష్ బాబు. తాజాగా తన జిమ్ వీడియోను షేర్ చేసాడు మహేష్. వర్కవుట్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో మహేష్ ‘బాక్స్ జంప్స్’ చేశాడు. ఈ వీడియోను చూసి మహేష్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.'మహేష్ వర్కవుట్స్ సూపర్.. ఆయన ఫిట్‌నెస్ ఇంకా సూపర్.. అందుకే ఆయన సూపర్ స్టార్' అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. 

మహేశ్‌‌ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మ‌హేశ్‌ మీసాలు లేకుండా, కాస్త జులుపాల జుట్టుతో క‌నిపించ‌నున్నాడు. బ్యాంకింగ్‌ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కునున్న ఈ మూవీలో మ‌హేశ్‌ స‌ర‌స‌న కీర్తి సురేష్ తొలిసారిగా జ‌త క‌డుతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం అందించనున్నారు.

More Related Stories