English   

మాల్దీవుల్లో మోహన్ బాబు జంట..ఫోటో వైరల్

Mohan babu
2021-01-21 15:40:05

ప్రస్తుతం టాలీవుడ్ సెలెబ్రెటీలు ఎక్కువగా వెళుతున్న హాలిడే స్పాట్ మాల్దీవులు. లాక్ డౌన్ తరవాత టాలీవుడ్ కు చెందిన జంటలు మాల్దీవులకి వెళ్లి ఎంజాయ్ చేశారు. అలా వెళ్లిన వారిలో రానా-మిహిక, నిహారిక-చైతన్య,కాజల్-కిచ్లు జంటలు ఉన్నాయి. దాంతో సెలబ్రెటీలకు మాల్దీవులు అంటే  ఎంతో ఇష్టమైన ప్రదేశం అని అర్థం అవుతోంది. అక్కడకు వెళ్లిన జంటలు ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అవి వైరల్ అవ్వడం కామన్. 

అయితే తాజాగా ఓ సీనియర్ హీరో జంట మాల్దీవుల్లో సెద తీరుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ జంట ఎవరో కాదు డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఆయన సతీమణి నిర్మల. ఫొటోలో మోహన్ బాబు ఒళ్ళో నిర్మల వాలిపోయిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. అయితే కేవలం మోహన్ బాబు, నిర్మల కలిసి ఈ మాల్దీవుల టూర్ కు వెళ్ళలేదు. వారితో పాటు మంచు లక్ష్మి ఆమె కూతురు, భర్త కూడా ఉన్నారు. ఇప్పటికే మంచు లక్ష్మి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇప్పుడు మోహన్ బాను, నిర్మల ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఫోటో చూసినవాళ్ళంతా షాక్ అవుతున్నారు. కాస్త సమయం దొరికినా తిరుపతి వెళ్లి దర్శనం చేసుకునే మోహన్ బాబు మాల్దీవులల్లో సరదాగా గడపటం చూసి ఆశ్చర్యపోతున్నారు.
 

More Related Stories