English   

రజినీకాంత్ సంచలన నిర్ణయం.. సినిమాలు ఇక చాలు..

 Rajinikanth
2021-01-21 16:39:53

నమ్మడానికి ఇది కాస్త కష్టంగా ఉన్నా తమిళనాట ప్రస్తుతం ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ ఇకపై సినిమాలు చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మొన్నటికి మొన్న రాజకీయాలు ఇక నేను చేయను.. పార్టీ కూడా పెట్టడం లేదు అంటూ తన మనసులో మాట చెప్పేశాడు సూపర్ సార్. దాంతో ఇక వరుసగా సినిమాలు చేస్తాడని అభిమానులు పండగ చేసుకున్నారు. రాజకీయాలు లేకపోతే లేదు.. కనీసం సినిమాల్లో రజనీకాంత్ ను చూస్తామని వాళ్లు సంతృప్తి చెందారు. కానీ ఇప్పుడు వాళ్లకు ఆ సంతృప్తి కూడా లేకుండా సూపర్ స్టార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లేనిపోని రిస్కులు తీసుకోవడం అంత మంచిది కాదు అని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది.

ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఆయన రెస్ట్ తీసుకోవడం కరెక్ట్ కానీ.. సినిమాలు చేసుకుంటూ పోతే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది అని వైద్యులు సూటిగా సూచించినట్లు తమిళనాట ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో అనవసరంగా సినిమాలు చేస్తే లేనిపోని అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లు అవుతుందని రజినీకాంత్ భావిస్తున్నాడు. ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా రిటైర్మెంట్ వైపు ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఆయన కమిట్ అయిన అన్నాతై సినిమా తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేయాలని భావిస్తున్నాడు.

ఈ వార్త సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి రజనీకాంత్ అభిమానులు కంగారు పడుతున్నారు. ఇందులో నిజం లేదు.. అందరూ పుకార్లు పుట్టిస్తున్నారు అని వాళ్లకు వాళ్లే సర్ది చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి రజనీకాంత్ బయటకు వచ్చి స్పష్టత ఇచ్చే వరకు ఈ కన్ఫ్యూజన్ అలాగే ఉండిపోతుంది. ఒకవేళ నిజంగానే రజినీకాంత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం తమిళనాట పెద్ద సంచలనం నమోదవడం ఖాయం. 70 ఏళ్ళ సూపర్ స్టార్ ఇప్పటి వరకు కెరీర్లో 150 సినిమాలకు పైగా నటించారు. మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలని రజిని అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా వేచి చూస్తున్నారు. 

More Related Stories