English   

"లక్ష్య" టీజర్ టాక్..!

lakhsya movie teaser talk
2021-01-22 14:30:20

నాగశౌర్య పుట్టిన రోజు సందర్బంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న "లక్ష్య" సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. సినిమాలో నాగశౌర్య విలు విద్య క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం నాగశౌర్య తన బాడీ మొత్తాన్ని మార్చుకున్నాడు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ ఫై, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా నేడు విడుదలైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. నాగశౌర్య ఒకవైపు లవర్ బాయ్ గా కనిపిస్తూనే మరోవైపు జుట్టు పెంచుకుని 8పాక్ బాడీతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. టీజర్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను జగపతి బాబు ఇచ్చారు. టీజర్ లో డైలాగులు బాగున్నాయి. "పడిలేచే వాడితో పందెం ప్రమాదకరం" అనే డైలాగ్ చూస్తే సినిమాలో నాగశౌర్య ఆటపై పట్టు కోల్పోయి మళ్ళీ బరిలోకి దిగుతాడని అర్థమవుతోంది. లవర్ బాయ్ ఇమేజ్ జున్ను నాగశౌర్య చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. 

 

More Related Stories