English   

నాగశౌర్యకు "వరుడు కావలెను" టీమ్ బర్త్ డే గిఫ్ట్..!

arudu Kavalenu team special surprise for Naga Shaurya
2021-01-22 14:36:56

ఊహలు గుస గుసలాడే సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగశౌర్య. 2011 లో క్రికెట్, గర్ల్స్ బీర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తరవాత 2014లో చందమామ కథలు సినిమాలో ఒక పాత్రలో నటించి అలరించాడు. కానీ అదే సంవత్సరం విడుదలైన ఊహలు గుస గుసలాడే సినిమా నటుడిగా బ్రేక్ ఇచ్చింది. ఆ తరవాత దిక్కులు చూడకు రామయ్య, కల్యాణ వైభోగమే, చలో, అశ్వత్తామ మొదలగు సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం లక్షతో పాటు వరుడు కావలెను అనే సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా తాజాగా నాగశౌర్య బర్త్ డే సంధర్భంగా వరుడు కావలెను చిత్ర బృందం ఓ సర్ప్రైస్ గిఫ్ట్ ఇచ్చింది. సినిమా నుండి నాగశౌర్య టీజర్ ను విడుదల చేసింది. టీజర్ లో నాగశౌర్య రిచ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్  గా నటిస్తోంది. సినిమాను సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను మే లో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తునట్టు తెలుస్తోంది. 

 

More Related Stories