English   

లోఫర్ హీరోయిన్ కు బెదిరింపు కాల్స్

Actress Disha Patani
2021-01-23 15:48:30

లోఫర్" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ దిశా పటాని. ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా వుంది. బాలీవుడ్ లో బాగీ2,3 సినిమాల్లో నటించి ప్రేక్షులకులను అలరించింది. మరోవైపు సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలోనూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యూత్ కు మత్తెక్కించే ఫోటోలను షేర్ చేస్తుంది. ఇక్కడి వరకు అంతా భాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ అమ్మడికి పెద్ద సమస్య వచ్చిపడింది. అదేంటంటే నిన్ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ అమ్మడికి ఫోన్ లు చేసి బెదిరిస్తున్నారట. అంతే కాకుండా పోలీసులకు ఫోన్ చేసి మీ దిశా పటాని ని ఎవరూ  కాపాడలేరు అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారట. దాంతో పోలీసులు నంబర్ ఆధారంగా విచారించగా అది పాకిస్థాన్ నుండి వచ్చినట్టు తేలింది. కానీ నిందితులు ఎవరన్నది ఇంకా తేలలేదు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. సినిమాల్లో మాదిరిగా వార్నింగ్ లు ఇస్తున్నారంటే దీనివెనుక పెద్ద కథే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 

More Related Stories