చరణ్ ఫ్యాన్స్ పై కొరటాల కి కోపం వచ్చిందట

ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "ఆచార్య". ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే సినిమా లోని చరణ్ ప్రీ లుక్ ను విడుదల చేసి "సిద్ధ" కి వెల్కమ్ అంటూ చిత్ర యూనిట్ చరణ్ కి వెల్ కమ్ చెప్పింది. చరణ్ ఈ సినిమాలో కేవలం గెస్ట్ రోల్ కాదని...ఒక 30 నిమిషాల నిడివి ఉండే పాత్ర అని కొరటాల రివీల్ చేసాడు. ఇక తాజాగా చరణ్ ఫ్యాన్స్ పై కొరటాల శివ కోప్పడినట్టు ఉన్నట్టు తెలిసింది. రామ్ చరణ్ ఫ్యాన్స్, చరణ్ కి అత్యంత సన్నిహితులు ఆచార్య షూటింగ్ సెట్ వద్దకు వెళ్లి చరణ్ ను కలిసారట. కొద్ది సేపు చరణ్ తో కలిసి ముచ్చటించారట. ఇంత వరకు బాగానే ఉంది. కానీ చరణ్ ను కలవడానికి వెళ్లిన వాళ్ళు కాళీగా ఉండకుండా ఆచార్య సెట్ ఫోటోలు, చరణ్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయం కొరటాల కు తెలిసింది. దాంతో ఆయన సిబ్బందిపై మండిపడ్డారట. షూటింగ్ కు సంబందించిన విషయాలు ఎలా భయటకు వచ్చాయని కోప్పడారట. లోపలికి ఎవరినీ అనుతించవద్దని సిబ్బందికి చెప్పారట. దాంతో చరణ్ కలగజేసుకుని కొరటాల కు నచ్చ జెప్పారని తెలుస్తోంది. ఈ సంఘటనతో చరణ్ కూడా సెట్ లోకి ఎవరినీ అనుమతించవద్దని చెప్పేసారట.