English   

ఆచార్య టీజర్ అప్డేట్

 Acharya
2021-01-27 11:41:34

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో  మెగాస్టార్ "ఆచార్య" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ వల్ల ఆలస్యం అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అయితే చరణ్ గెస్ట్ రోల్ లో కాకుండా ఓ ఫుల్ లెన్త్ రోల్ లో నటిస్తున్నారు. సినిమాలో చరణ్ ఒక 30 నిమిషాల పాటు కనిపించబోతున్నాని కొరటాల ఇప్పటికే వెల్లడించారు. ఇక ఇటీవలే చరణ్ కు వెల్ కమ్ చెబుతూ చిత్ర యూనిట్ ప్రీలుక్ ను కూడా విడుదల చేసింది. 

ఇక ఈ సినిమా టీజర్ ఇప్పటికే రావాల్సి ఉంది కానీ లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయ్యింది. దాంతో చిరు అభిమానులు, మరోవైపు చరణ్ అభిమానులు టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల నిన్న టీజర్ పై మెగాస్టార్ తో ఆయనకు జరిగిన చర్చను ఓ మీమ్ రూపంలో వెల్లడించారు. టీజర్ అప్డేట్ ను ప్రకటిస్తామని అన్నారు. ఇక కొరటాల చెప్పినట్టే టీజర్ అప్డేట్ ను ప్రకటించారు. జనవరి 29న సాయంత్రం 4 :5నిమిషాలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ లో ధర్మస్థలికి తలుపులు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. 

More Related Stories