ఆస్కార్ నామినేషన్ రేసులో ఆకాశం నీ హద్దురా

సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా చిత్రం ఆస్కార్ రేసుకు ఎంట్రీ అయినట్లు ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరక్టర్, బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ కోసం.. ఆస్కార్స్‌లో జనరల్ క్యాటగిరీలో పోటీపడనున్నట్లు పాండియన్ తెలిపారు. అకాడమీలో తమ సినిమా స్క్రీనింగ్‌కు గ్రీన్ సిగ్నల్ దక్కిందన్నాడు.లాక్డౌన్, కరోనా వైరస్ కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య నటన, సుధా కొంగర టేకింగ్ అందరినీ అలరించింది. సాధారణంగా అకాడమీ అవార్డులను కేవలం థియేటర్లలో విడుదలైన చిత్రాలనే పరిశీలిస్తారు. కానీ, ఈ ఏడాది కరోనా సంక్షోభం కారణంగా డిజిటల్ వేదికల్లోనూ విడుదలైన చిత్రాలను ఆస్కార్ పోటీకీ అర్హులుగా పరిగణించారు. దీంతో ఈ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.