English   

ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్ ..అనుష్క

Anushka Shetty
2021-01-27 22:42:43

టాలీవుడ్ అందాల తార అనుష్క సైబరాబాద్ లో డయల్ 100 క్విక్  రెస్పాన్స్ వాహనాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమలో అడిషనల్ డీజీ స్వాతి లక్రా, సైబరాబాద్ సీపీ సజ్జానార్ సైతం పాల్గొన్నారు. ఫ్రీ షీ షటిల్ బస్ లను అనుష్కతో పాటు డిజిపి, సీపీ కలిసి ప్రారంభించారు. అనంతరం "షీ పాహి", ఫస్ట్ అన్యువల్ కాన్ఫరెన్స్ 2021 ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ అధికారులతో పాటు అనుష్క హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్వీటీ మాట్లాడుతూ...ఇక్కడ ఉన్న ప్రతి మహిళ పోలీస్ సిబ్బంది ఒక స్టార్ అని వ్యాఖ్యానించారు. కోవిడ్ టైం లో పోలీస్ లు చాలా బాగా పని చేశారన్నారు. తనను కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అనుష్క కృతజ్ఞతలు తెలిపారు. ఇంత మంది మహిళా పోలీస్ లు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. షి పాహి అనే పేరు పెట్టడం చాలా బాగుందని వ్యాఖ్యానించారు. సమాజంలో ఒకరికి ఒకరు తోడు గా ఉండాలని అనుష్క అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పోలీసులకు అవార్డులు అందజేశారు.
 

More Related Stories