English   

శృతికి వెల్కమ్ చెప్పిన సాలార్ టీమ్

Salaar team
2021-01-28 12:29:47

క్రాక్ సినిమా హిట్ తో శృతి హాసన్ ఫుల్ బిజీగా ఉంది. చేతి నిండా ఆఫర్లతో వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఈరోజు శృతి హాసన్ పుట్టిన సంధర్భంగా ఆమె అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది "సలార్" టీమ్. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ చేయనుంది అనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా చిత్ర యూనిట్ శృతి హాసన్ కు బర్త్ డే విషెష్ చెబుతూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. వెల్ కమ్ టూ సలార్..ఈ పుట్టిన రోజు మీకు అద్భుతంగా జరగాలి అంటూ చిత్ర నిర్మాణ సంస్థ హంబెల్ ఫిలిమ్స్ పేర్కొంది. 

ఇదిలా ఉండగా "సలార్" సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను హంబెల్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ గుండూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యష్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం తెలంగాణలోని రామగుండంలో గల బొగ్గు గనుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు నుండి షూటింగ్ కూడా ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. ఇక్కడ రెండు వారాలపాటు ఓ భారీ ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.   

More Related Stories