English   

అల్లు అర్జున్ పుష్ప విడుద‌ల తేదీ ఖ‌రారు

Allu Arjun
2021-01-28 13:30:51

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సినిమాలో అల్లు అర్జున్ కు  జంటగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గ కనిపించబోతున్నాడు. అంతే కాకండా చిత్రాన్ని  చెక్కల స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇలాంటి పాత్రలో నటించడం ఇదే మొదటి సారి. దాంతో సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించింది. సినిమాను ఈ ఏడాది ఆగస్టు 13న విడుదల చేస్తునట్టు పేర్కొంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ లుక్ ను సైతం చిత్ర యూనిట్ విడుదల చేసింది. పోస్టర్ లో అల్లు అర్జున్ గొడ్డలి పట్టుకుని కనిపిస్తున్నాడు. పోస్టర్ గూడ్స్ బమ్స్ వచ్చేవిధంగా ఉండటంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్ డౌన్ వల్ల ఆలస్యం అయ్యింది. ఇక లాక్ డౌన్ తరవాత కొద్దీ రోజులు మారేడ్ పల్లి అడవుల్లో షూట్ చేసారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా అడవుల్లో జరుగుతోంది. 

More Related Stories