ఆచార్య కోసం కోటి రెమ్యునరేషన్..

మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్యలో రామ్ చరణ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ కు కూడా జోడీ ఉండనుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం చరణ్ సరసన పూజా హెగ్డే నటించబోతోందని తెలుస్తుంది. అయితే ఈ పాత్ర కోసం పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. వినడానికి కొంచెం ఆశ్యర్యంగానే ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు ఈ భామకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి.
ఇక ఆచార్యలో అందరూ బడా స్టార్స్ నటిస్తుండటంతో తను కూడా భారీగానే రెమ్యూనరేషనర్ తీసుకోవాలని పూజా భావించి కోటి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు చిత్ర యూనిట్ కూడా సుముఖంగానే ఉండటంతో అక్షరాల కోటి రూపాయలకు ఆమెకు సమర్పించుకోనున్నారు. మరి అంత మొత్తంలో అందుకున్న పూజా క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఆచార్య విడుదలయయ్యే వరకు వేచి చూడాలి.