English   

రానా విరాట పర్వం విడుదల తేది ఖరారు

Rana Virataparvam
2021-01-28 17:43:44

బాహుబలి సినిమాతో ప్రభాస్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. కానీ రానా మాత్రం కమర్షియల్ కథల్లో కాకుండా తనకు నచ్చిన.. పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం రానా వేణు ఉడుగుల దర్శకత్వంలో "విరాట పర్వం" అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో తెరకెకుతోంది. సినిమాలో రానా కామ్రేడ్ రవన్న పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నందితా దాస్, ప్రియమణి, కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్విసి సినిమాస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. దాంతో సినిమాపై కీడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక తాజాగా ఈ సినిమాపై చిత్ర యూనిట్ కీలక అప్డేట్ ఇచ్చింది. సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

More Related Stories