English   

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్ ఇదే

Nag Ashwin Prabhas
2021-01-29 11:52:17

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను పిరియాడికల్ ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిఅతున్నారు. ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరవాత ప్రభాస్ "సలార్" సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రభాస్ సలార్ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. మరోవైపు ప్రభాస్ ఇప్పటికే మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ఓ సినిమాకు గ్రీన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాపై తాజాగా నాగ్ అశ్విన్ ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతే కాకుండా సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా డాని పని చేస్తున్నట్టు పేర్కొన్నాడు. కాగా ఈ ఇద్దరు కూడా గతంలో మహానటి సినిమాకు పని చేసిన వారే కావడం విశేషం.

More Related Stories