English   

ఎన్టీఆర్ ప్రేయసిని పరిచయం చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్

RRR
2021-01-29 13:31:30

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాలో చరణ్ ఎల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా...ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా..ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటిస్తోంది. కాగా ఈరోజు మోరీస్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ ఆమె ఫస్ట్ లుక్ ను రివీల్ చేసింది. సినిమాలో ఒలీవియా జెన్నిఫర్ గా అలరించబోతునట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. త్వరలోనే ఇద్దరి ఫోటో పోస్టర్ ను విడుదల చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆఖరి దశకు చేరింది. దాంతో సినిమాని అక్టోబర్ లో విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్.ప్రకటించింది.
 

More Related Stories