English   

నారప్ప రిలీజ్ డేట్ ఫిక్స్

Venkateshs Narappa
2021-01-29 15:24:01

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తమిళ సూపర్ హిట్ సినిమా అసురన్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అసురన్ సినిమాలో ధనుష్ హీరోగా నటించాడు. ఇక తెలుగులో "నారప్ప" పేరుతో సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా స్క్రిప్ట్ లో శ్రీకాంత్ అడ్డాల కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సడెన్ గా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ ఏడాది మే 14న సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సంధర్భంగా విడుదల చేసిన వెంకీ లుక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై వెంకీ అభిమానులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులకు అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను నారప్ప రీచ్ అవుతాడా.? లేదా? అన్నది చూడాలి.
 

More Related Stories