English   

ప్రేమ కథల దర్శకుడు విలన్ గా మెప్పిస్తాడా

Gautham Menon
2021-01-29 18:21:04

అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో దర్శకుడు గౌతమ్ మీనన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. లవ్ స్టోరీలనే కాక యాక్షన్ థ్రిల్లర్ లను సైతం తెరకెక్కించి గౌతమ్ మీనన్ ఇండస్ట్రీలో తన మార్క్ వేసుకున్నాడు. ఏమ్మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసాడు. ఇక ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకుడిగానే కాక..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అలరిస్తున్నాడు. మరోవైపు ఇప్పుడు విలన్ గా కూడా గౌతమ్ మీనన్ ఎంట్రీ ఇవ్వబోతునట్టు తెలుస్తోంది. తన దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన కృష్ణ ఎన్ సినిమా "పతు తల "లో గౌతమ్ విలన్ గా అలరించనున్నారట. ఈ సినిమాలో శింబు హీరోగా నటిస్తున్నాడు. ఎన్. కృష్ణ కోరిక మేరకు గౌతమ్ మీనన్ విలన్ గా చేయడానికి ఒప్పుకునట్టు తెలుస్తోంది. మరోవైపు శింబు తో తమిళ్ ఎమ్మాయ చేసావే సినిమా తీసి మంచి హిట్ ఇచ్చాడు. అప్పటి నుండి ఇద్దరి మధ్య క్లోస్ నెస్ ఉంది. దాంతో గౌతమ్ మీనన్ ఈ ప్రాజెక్టు కి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శింబు అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరి అందమైన ప్రేమ కథలు తెరకెక్కించే గౌతమ్ మీనన్ విలన్ గా మెప్పిస్తాడా లేదా.. అన్నది చూడాలి.

More Related Stories