English   

దయచేసి మా ఇంటికి రాకండి...ఫ్యాన్స్ కు శింబు రిక్వెస్ట్

Simbu
2021-01-30 12:39:21

తమిళ స్టార్ హీరోలలో శింబు ఒకరు. ఒకప్పుడు వరుస విజయాలతో శింబు ఫామ్ లో ఉండేవాడు. కానీ ఆ తరవాత ఎక్కువగా వార్తల్లో ఉండటం సినిమాలు ప్లాఫ్ అవ్వడంతో కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదురుకున్నాడు. ఓ వైపు ప్రేమాయనాలు..మరోవైపు ప్రొడ్యూసర్ లతో గొడవలే శింబు ఇక్కడివరకు తీసుకువచ్చయని టాక్. ఇక ప్రస్తుతం మళ్లీ తన కెరీర్ ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న శింబు తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేసాడు. ట్వీట్ లో అభిమానులు ఎవరూ తన ఇంటికి రావద్దని రిక్వెస్ట్ చేసాడు. అసలు మ్యాటర్ ఏంటంటే శింబు పుట్టిన రోజు ఫిబ్రవరి 3వ తేదీన ఉంది. ఆ రోజు శింబు 38 వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్నాడు. కాగా తన పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఎవరూ తన ఇంటికి రావద్దని పేర్కొన్నాడు. తాను ఇంట్లో ఉండటం లేదని ఈ ఏడాది ఒక కొత్త ప్రదేశానికి వెళుతున్నట్టు తెలిపాడు. అంతే కాకుండా తన జీవితంలో అన్ని సంధర్భాల్లో ప్రేమ చూపించింది. అభిమానులేనని అన్నాడు. జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురుకున్నానని..కానీ మీ అభిమానం మాత్రం అలాగే ఉందంజ్ తెలిపాడు. ప్రస్తుతం ఇలా ఉండటానికి కారణం మీ అభిమానమేనని శింబు అన్నాడు. "ఈశ్వరన్" సినిమాపై మీరు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు.

More Related Stories