English   

ఇందిరమ్మగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్

 Kangana Ranaut
2021-01-30 14:15:34

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం గ్లామర్ పాత్రల్లో కాకుండా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లోనే ఎక్కువగా నటిస్తోంది. ప్రస్తుతం కంగనా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ "తలైవి" లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ఇప్పుడు ఈ ఫైర్ బ్రాండ్ మరో బయోపిక్ తో ముందుకు వస్తోంది. భారత తొలి ప్రధాని..ఉక్కు మహిళగా పేరున్న ఇందిరా గాంధీ పాత్రలో నటించబోతుంది. 

ఈ విషయాన్ని కంగనా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు తన లుక్ ను కూడా వదిలింది. ఫొటోలో కంగనా అచ్చం ఇందిరా గాంధీ లానే కనిపిస్తోంది. అయితే ఈ సినిమా ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించడం లేదట. ఇందిరా గాంధీ జీవితంలో జరిగిన ఒక కీలక ఘట్టం ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. సినిమాకు కంగనా స్నేహితుడు సాయి సాయి కబీరు దర్శకత్వం వహిస్తున్నట్టు వెల్లడించారు. అంతే కాకుండా మనికర్ణిక సినిమాకు పని చేసిన టీమ్ ఈ సినిమాకు పనిచేస్తుందని పేర్కొంది. సినిమాలో రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి పాత్రలు కూడా ఉంటాయని పేర్కొన్నారు.
 

More Related Stories