English   

ఖిలాడికి విలన్ గా యాక్షన్ కింగ్

Arjun Sarja
2021-01-30 14:23:21

క్రాక్ హిట్ తో మాస్ మహరాజ్ రవితేజ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఇప్పటికే భారీగా రెమ్యునేషన్ కూడా పెంచేసాడు. ఇక ప్రస్తుతం అదే జోష్ లో "ఖిలాడి" సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కీలక ప్రకటనను చిత్ర యూనిట్ వెల్లడించింది. అదేంటటే..ఈ సినిమాలో రవితేజ కి విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నాడని కొద్దిరోజులుగా టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా  అర్జున్ ఖిలాడి లో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఏ మేరకు ఖిలాడి  మూవీలోకి వెల్ కమ్ చెబుతూ ట్వీట్ చేసింది. ఇక తమిళంలో స్టార్ గా ఎదిగిన అర్జున తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరివాడే. అర్జున్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయం సాధించాయి. ఇక ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్నాడు. చివరగా అల్లుర్జున్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఖిలాడి లో అర్జున్ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

More Related Stories