ఏప్రిల్ లో వకీల్ సాబ్ విడుదల

2021-01-31 14:53:48
సంక్రాంతి సందర్భంగా ‘వకీల్ సాబ్’ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్ర యూనిట్. ఉగాది కానుకగా ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. రిలీజ్ డేజ్ ప్రకటించడంతో సినిమా కోసం ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పవర్ స్టార్ తొలిసారిగా వకీల్‌గా భిన్న పాత్ర పోషించారు. హిందీలో వచ్చిన 'పింక్' చిత్రాన్ని తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.