English   

మరోసారి మెగాస్టార్ తమ్ముడిగా శ్రీకాంత్

Srikanth
2021-02-01 13:00:20

ఒకప్పటి ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ప్రస్తుతం ఓ వైపు అడపా దడపా సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో మెగాస్టార్ కు తమ్ముడిగా నటించి మంచి మార్కులు కొట్టేసాడు. సినిమాలో చిరు రైట్ హాండ్ గా ఏటీఎం పాత్రలో అలరించాడు. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు సినిమాలో కీలకంగా మారాయి. ఆ తరవాత బాలయ్య సినిమా "శ్రీరామ రాజ్యం" లోను నటించి అలరించారు. ఇక ఇటీవల వచ్చిన రామ్ చరణ్ గోవిందుడు అందరివాడు, అల్లు అర్జున్ సరైనోడు సినిమాల్లో హీరోలకు బాబాయ్ గా నటించాడు. ఇదిలా ఉండగా మరోసారి మెగాస్టార్ కు శ్రీకాంత్ తమ్ముడిగా నటించబోతున్నాడని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చిరు కు తమ్ముడి పాత్ర కీలకంగా ఉంటుందట. ఆ పాత్రలో శ్రీకాంత్ ను తీసుకోవాలని మెగాస్టార్ మోహన్ రాజాకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.  

More Related Stories