English   

ప్రభాస్ కు తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్

Hema Malini
2021-02-01 17:44:07

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాను కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం ఆరు భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వాటిలో మొదటి యాక్షన్ సన్నివేశాన్ని ప్రస్తుతం గోదావరిఖని బొగ్గు గనుల్లో చిత్రిస్తున్నారు. ఈ సినిమా తరవాత ప్రభాస్ మరో పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు అదే "ఆది పురుష్". ఆది పురుష్ సినిమా ను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. చిత్రాన్ని పౌరాణిక గాధ రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా నటించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు హీరోయిన్ గా  సీత గా క్రితి సనన్ నటించబోతుందని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. సినిమాలో ప్రభాస్ కు తల్లిగా హీరోయిన్ హేమా మాలిని నటించబోతున్నట్టు. టాక్ నడుస్తోంది. అయితే దీనిపై కీడ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

More Related Stories