English   

పవన్ సినిమాలో ఆఫర్ వచ్చినా సాయి పల్లవి అంత డిమాండ్ చేసిందా

Sai Pallavi
2021-02-01 18:06:39

పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం ఒక అదృష్టంగా భావిస్తుంటారు హీరోయిన్ లు. ఎన్నో ఇంటర్వ్యూలలో పలువురు హీరోయిన్ లు ఈ విషయాన్ని భయటకు కూడా చెప్పారు. కానీ ఫిదా భామ సాయి పల్లవి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పవన్ సినిమా "అయ్యప్పనుమ్ కొషియం" రీమేక్ కోసం ఈ అమ్మడిని సంప్రదించగా ముందు నో చెప్పిందట. ఆ తరవాత మేకర్స్ ఒప్పించడానికి ప్రయతించగా ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేసిందట. దాంతో మేకర్స్ 2 కోట్లు రెమ్యునేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నతరవాత సంతకం పెట్టిందని టాక్.

 నిజానికి సాయి పల్లవికి కూడా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకే తన  క్రేజ్ కు తగ్గట్టుగా సాయి పల్లవి కూడా డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో రానా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండగా...రానా పక్కన హీరోయిన్ గా ఐష్వర్య రాజేష్ నటిస్తోంది. అంతే కాకుండా సినిమాలో రానా కి తండ్రిగా సముద్రఖని నటిస్తున్నాడు. ఇక మలయాళం లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాపై ప్రేక్షహకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రీచ్ అవుతారా లేదా అన్నది చూడాలి.

More Related Stories