English   

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Sai Dharam Tej
2021-02-01 19:17:51

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో లైఫే సో బెటర్ సినిమా విడుదల కాగా ఆ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ యాంగ్ హీరో టాలెంటెడ్ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో "రిపబ్లిక్" అనే సినిమాలో నటిస్తున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. ఈ మోషన్ పోస్టర్ లో సాయి ధరమ్ తేజ్ డైలాగులతో అదరగొట్టాడు. గుర్రాలను చూపిస్తూ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. 

ఈ సినిమా దేవ కట్ట దర్శకత్వంలో వస్తున్న పక్కా పొలిటికల్ డ్రామా గా కనిపిస్తోంది. అంతే కాకుండా "ప్రస్థానం" లాంటి పొలిటికల్ ఎమోషనల్ ను తెరకెక్కించిన దేవ కట్ట ఈసారి కూడా అదే రేంజ్ లో "రిపబ్లిక్" ను తెరకెక్కిస్తున్నారని తేజ్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా సినిమాకు మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. జూన్ 4వ తేదీన విడుదల చేస్తున్నట్టు పేర్కొంది.

More Related Stories