English   

ప్రభాస్ ఆదిపురుష్ మొదలయ్యింది

 Adipurush
2021-02-02 13:10:40

యంగ్  రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్  బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం డార్లింగ్ కేజిఎఫ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న "సలార్" సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని గోదావరి ఖని బొగ్గు గనుల్లో జరుగుతోంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగానే ప్రభాస్ ప్రభాస్ "ఆది పురుష్" సినిమా షూటింగ్ కూడా ఈరోజు మొదలయ్యింది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆది పురుష్ ఆరంభం అంటూ సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే ప్రభాస్ మాత్రం ఇప్పుడే షూటింగ్ జాయిన్ అయ్యేలా కనిపించడంలేదు. ప్రస్తుతం సలార్ షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రెండు సినిమాలు బ్యాలెన్స్ చేస్తాడా లేదంటే మొదట ప్రభాస్ అవసరం లేని సన్నివేశాలను తెరకెక్కిస్తారా అన్నది తెలియాలి. ఇక ఈ ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా..లంకేష్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ గా సీత పాత్రలో  కృతి సనన్ నటించబోతున్నట్టు టాక్ నడుస్తోంది. అంతే కాకుండా ప్రభాస్ తల్లి గా కౌసల్య పాత్రలో హేమమాలిని నటిస్తున్నట్టు సమాచారం. 

More Related Stories