English   

ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలకానున్న ఉప్పెన ట్రైలర్

 Jr NTR
2021-02-02 14:33:40

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'ఉప్పెన'. ఈ  సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది ప్రమోషన్ జోరు పెంచుతున్నారు మేకర్స్. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ విడుదల చేస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌తో ఉన్న సత్సంబంధాలు కూడా ఉప్పెన ట్రైలర్‌ను ఎన్టీఆర్‌ విడుదల చేయడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ ను ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. వైష్ణవ్‌ తేజ్‌ జతగా కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుండగా తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్  సంస్థలు నిర్మించాయి. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 12న విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  

More Related Stories